న్యూఢిల్లీ: పశువుల దాణా కుంభకోణంలో అరెస్ట్ తప్పదని తెలిసినప్పుడు అప్పటివరకు బీహార్ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం పీఠంపై తన భార్య రబ్రీదేవిని కూర్చోబెట్టి సంచలనానికి తెరతీశారు. అయితే వాస్తవానికి ఆయన మొదటి ఎంపిక రబ్రీదేవి కాదు. లాలూ తన పార్టీ ఎంపీ కాంతిసింగ్ను తన వారసురాలిగా నియమించాలనుకున్నారు. అయితే అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్తో జరిగిన సంభాషణతో మొత్తం స్క్రిప్ట్ మారిపోయింది. తర్వాత సీఎంగా రబ్రీదేవి తెరపైకి వచ్చారు. ఈ విషయాలను సీనియర్ జర్నలిస్టు అమరేందర్ కుమార్ ‘నీలే ఆకాశ్ కా సచ్’ (నీలి ఆకాశం వెనుక ఉన్న నిజం) బుక్లో వివరించారు.