Jana Gana Mana | ‘జన గణ మన’ గీతాన్ని స్వయంగా రవీంద్రుడు ఆలపించింది ఇక్కడే..!
Jana Gana Mana | ‘జనగణమన’ను భారతదేశ జాతీయగీతంగా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అధికారికంగా స్వీకరించింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు తీసుకుంటే, తగ్గించిన భాగాన్ని పాడటానికి 20 సెకండ్లు పడుతుంది.
Jana Gana Mana | ‘జనగణమన అధినాయక జయహే..’ గీతాన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీలో రచించాడు. అయితే సంస్కృత ప్రభావం ఉన్న బెంగాలీ మాండలికమైన ‘సాధుభాష’ను ఎంచుకోవడం విశేషం.
జనగణమనకు ఎన్నో ప్రత్యేకతలు. ఇందులో ప్రయోగించిన పదాలు కూడా దేశ వ్యాప్తంగా అన్ని భాషల వారికి బాగా పరిచయం ఉన్నవి కావడం గమనార్హం. అందుకే అందరి ఆమోదాన్ని, ఆదరణను పొందగలిగింది. ఈ గీతాన్ని భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల సందర్భంగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో తొలిసారిగా ఆలపించారు. దీనిని 1912లో తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ శీర్షికన ప్రచురించారు.
ఇక కలకత్తాకు బయట ‘జనగణమన’ను చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్న బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో 1919 ఫిబ్రవరి 28న స్వయంగా రవీంద్రనాథ్ టాగూర్ ఆలపించారు. దేశం స్వాతంత్య్రం పొందిన 1947 ఆగస్టు 14 మధ్యరాత్రి రాజ్యాంగ సభ తొలిసారిగా ఒక సార్వభౌమ సంస్థగా సమావేశమైంది. ఆ సమావేశాన్ని ‘జనగణమన’ ఆలాపనతోనే ముగించారు. ‘జనగణమన’ను భారతదేశ జాతీయగీతంగా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అధికారికంగా స్వీకరించింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు తీసుకుంటే, తగ్గించిన భాగాన్ని పాడటానికి 20 సెకండ్లు పడుతుంది. జాతీయగీతం దేశ ప్రజలకు గర్వకారణం. జాతీయగీతానికి సంబంధించిన నైతిక నియమావళిని జాతి గౌరవ చట్టం, 1971లో పొందుపరచారు.
ఒక దేశం తన స్వతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని బలంగా ప్రకటించే ప్రతీకల్లో అతి ప్రధానమైనది జాతీయగీతం. భారతదేశంలో విభిన్నమైన భాషల వాళ్లు నివసిస్తున్నప్పటికీ జనగణమనను అందరూ సులువుగా అర్థం చేసుకుంటారు. దేశానికి వెన్నెముకగా నిలిచే సంప్రదాయాలు, విలువలను జాతీయగీతం చక్కగా అందిస్తుంది. భారతదేశ బహుళత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్క జనగణమన మాత్రమే కాదు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ సోనార్ బంగ్లా’ కూడా టాగూర్ రాసిందే. అంతేకాదు శ్రీలంక జాతీయగీత రచనలోనూ రవీంద్రుడి ముద్ర కనిపిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

