ఖతార్ ఎయిర్వేస్ రిక్రూట్మెంట్కు భారీగా అభ్యర్థులు… నియంత్రించలేక ఇంటర్వూలు రద్దు
వేలల్లో తరలివచ్చిన అభ్యర్థులను ఖతార్ ఎయిర్వేస్ సిబ్బంది నియంత్రించలేకపోయారు. దీంతో వాక్-ఇన్-ఇంటర్వూలను రద్దు చేశారు. వేల సంఖ్యలో దరఖాస్తుదారులను తిప్పిపంపారు. దీంతో వారంతా నిరాశ చెందడంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబై: ఖతార్ ఎయిర్వేస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నియంత్రించలేక పోయిన ఆ సంస్థ ఇంటర్వూలు రద్దు చేసింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులు నిరాశ చెందారు. ఖతార్ ఎయిర్వేస్ ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నది. విమానయాన రంగం చరిత్రలో అతిపెద్ద టాలెంట్ హంట్‌గా ఆ సంస్థ అభివర్ణించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ నెల 29 నుంచి 30 వరకు ఓపెన్ రిక్రూటింగ్‌కు పిలుపునిచ్చింది. దీంతో పలు ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులు వేలల్లో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్ మేళా నిర్వహించే ముంబైలోని హోటల్ వద్ద అభ్యర్థులు కిలోమీటర్ల మేర బారులు తీరారు.
కాగా, వేలల్లో తరలివచ్చిన అభ్యర్థులను ఖతార్ ఎయిర్వేస్ సిబ్బంది నియంత్రించలేకపోయారు. చివరకు వాక్-ఇన్-ఇంటర్వూలను రద్దు చేశారు. వేల సంఖ్యలో దరఖాస్తుదారులను తిప్పిపంపారు. దీంతో వారంతా నిరాశ చెందడంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఖతార్ ఎయిర్‌వేస్‌లోని పలు విభాగాలకు సంబంధించిన 700 పోస్టులకుగాను 20,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. కాగా, వాక్-ఇన్- ఇంటర్వూ కోసం అభ్యర్థులు కిలోమీటర్ల మేర బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతిపెద్ద బ్లాక్ ఫ్రైడే డీల్‌గా కొందరు పేర్కొన్నారు.
Another one pic.twitter.com/7iSjHRfhkm
— Vikesh Kumar Singh (@vikesh320) September 29, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

