తిరువనంతపురం: మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలోని కొండచిలువతో పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మద్యం సేవించిన చంద్రన్ మెడలో కొండచిలువ వేసుకుని వలపట్టణంలోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. మెడలోని కొండచిలువతో సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు.
కాగా, చంద్రన్ మెడలో ఉన్న కొండచిలువ అతడి మెడకు గట్టిగా చుట్టుకుంది. దీంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిన అతడు కింద పడిపోయాడు. ఇది చూసి పెట్రోల్ బంకులో పనిచేసే అభిషేక్ వెంటనే స్పందించాడు. ఒక కవర్ సంచితో చంద్రన్ వద్దకు వెళ్లాడు. అతడి మెడకు చుట్టుకుని ఉన్న కొండచిలువను విడిపించేందుకు ప్రయత్నించాడు. చివరకు చంద్రన్ మెడను వీడిన ఆ కొండచిలువ పక్కకు వెళ్లిపోయింది. మరోవైపు ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
കണ്ണൂർ വളപട്ടണം – ഇന്നലെ രാത്രി pic.twitter.com/9Ms1OIw8qv
— Ramith :: My :: india.🇮🇳🇮🇳 (@Ramith18) October 21, 2023