లక్నో: ఒక పెద్ద కొండచిలువ మేకను మింగింది. అనంతరం ఒక స్కూల్ బస్సులోకి అది దూరింది. గమనించిన గ్రామస్తులు ఆ స్కూల్ యాజమాన్యానికి ఈ విషయం తెలిపారు. దీంతో బస్సులో దూరిన భారీ కొండచిలువను సురక్షితంగా బంధించారు. ఉత్తర ప్రదేశ్లోని రాయబరేలిలో ఈ సంఘటన జరిగింది. స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన బస్సును శనివారం ఒక గ్రామం వద్ద నిలిపి ఉంచారు. కాగా, భారీ కొండచిలువ ఒక మేక పిల్లను మింగింది. అనంతరం అది ఆ స్కూల్ బస్సులోకి దూరింది. గమనించిన గ్రామస్తులు ఆ స్కూల్ యాజమాన్యానికి ఈ విషయం చెప్పారు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందిని రప్పించారు. వారు ఎంతో శ్రమించి బస్సులో దూరిన భారీ కొండచిలువను సురక్షితంగా ఒక గోనె సంచిలో బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే స్కూల్ బస్సులో దూరిన పెద్ద కొండచిలువను బయటకు తీస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Huge Python Ate A Goat, Then Sat Inside UP School Bus. Watch Rescue Video https://t.co/W2xYGibiBV pic.twitter.com/NPqGhcejHK
— NDTV (@ndtv) October 16, 2022