హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ మంగళవారం సందర్శించారు. శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న కుల్తార్ సింగ్‌కు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ నిర్వహణ, పనితీరుని కుల్తార్ సింగ్‌కు వివరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయనకి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని, దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ ప్రశంసించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరుఫున కుల్తార్ సింగ్‌ని శాలువాతో సత్కరించారు. కుల్తార్ సింగ్‌తోపాటు ఆ రాష్ట్ర శాసనసభ్యుడు కల్వంత్ సింగ్ పండోరి, మాజీ శాసనసభ్యుడు అమర్ జీత్ సింగ్ ఉన్నారు.