India-Pakistan Tension | భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్‌తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొనే ఈ రాష్ట్రం పాకిస్తాన్‌తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే పంజాబ్ అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని, పరీక్షలను రద్దు చేయాలని ఆదేశించింది. జలంధర్‌లోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ ఊహించని పరిస్థితుల కారణంగా సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ని పరీక్షలు మళ్లీ నిర్వహించే ఐదురోజుల ముందు ప్రకటిస్తామని పేర్కొంది. మరో వైపు ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఓ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసింది.
రాష్ట్ర విద్యా మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్టా పంజాబ్ అంతటా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నీ మూడురోజులు మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్‌పూర్, తర్న్ తరణ్ జిల్లాలో గురువారం బ్లాక్అవుట్స్ విధించారు. ఆయా చోట్ల పాక్ డ్రోన్లు దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆయా డ్రోన్లను భారత్ కూల్చివేసింది. పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో అధికారులు శనివారం వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బీఎస్ఎఫ్ ఫిరోజ్‌పూర్ సెక్టార్లో ఓ చొరబాటుదాడిని అడ్డుకుంది.
శుక్రవారం తెల్లవారు జామున భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దును దాటుతుండగా కాల్చి చంపింది. సింగ్ వాలా బీఎస్ఎఫ్ పోస్ట్ పక్కన ఉన్న గేటు వద్ద చొరబాటు ప్రయత్నాలను గుర్తించారు. పంజాబ్ ప్రభుత్వం పోలీసులు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ప్రభుత్వం, మూడు కోట్ల మంది పంజాబీలు భారత సైన్యానికి అండగా నిలబడ్డారని పంజాబ్ ఆమ్ ఆద్మీ చీఫ్ అమన్ అరోరా పేర్కొన్నారు. భద్రతా బలగాల తర్వాత పంజాబ్ పోలీసు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అరోరా తెలిపారు. పంజాబ్ పాకిస్తాన్‌తో 532 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటుందన్నారు. ప్రజా భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని.. అయితే, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే, ఈ నెల 9, 10 తేదీల్లో లెహ్ పరిపాలన శుక్రవారం ప్రకటించింది. లేహ్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రాబోయే రెండు రోజులు మూసివేస్తామని లేహ్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ సుఖ్దేవా తెలిపారు.