Tiffin Bomb | పంజాబ్ సరిహద్దుల్లో టిఫిన్ బాంబు రికవరీ..
Tiffin Bomb | పాక్ సరిహద్దుల్లోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా లోని పొలంలో పోలీసులు టిపిన్ బాక్స్ బాంబు స్వాధీనం చేసుకున్నారు.

Tiffin Bomb | దీపావళి పండుగ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు సరిహద్దుల్లో ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు జలలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా, టిఫిన్ బాక్స్ బాంబు సంగతి బయటపడింది. అలీకే గ్రామంలో ఈ టిఫిన్ బాక్స్ బాంబును పోలీసులు వెలికితీశారు. జలాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.
ఈ పేలుడు కేసుతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్ అలియాస్ గోరాకు షెల్టర్ కల్పించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి విచారించారు. ఝుగ్గే నిహంగ వాలే గ్రామ వాసి జశ్వంత్ సింగ్ అలియాస్ షిండా బాబా, లుధియానాలో వాలిపూర్ ఖుర్డ్ వాసి బల్వంత్ సింగ్ అనే వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ సింగ్ అలియాస్ గోరాను కూడా అరెస్ట్ చేశారని పంజాబ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్‌సింగ్ సాహోటా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Punjab
- Tiffin box bomb
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

