చండీఘడ్: పంజాబ్ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆఫీసుల్లో పని వేళలను మార్చేసింది. సాధారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఆఫీసు వేళలను.. ప్రజల ప్రయోజనాల కోసం ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరవనున్నారు. ఆఫీసు టైమ్‌ను మార్చిన నేపథ్యంలో.. ఇవాళ పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్(CM Bhagwant Mann).. తొందరగానే ఆఫీసుకు వచ్చారు. భగవంత్‌మాన్ సర్కార్‌లోని మంత్రులు అమన్ అరోరా, బ్రహ్మ శంకర్ జింపా, హర్భజన్ సింగ్, కుల్దీప్ సింగ్, దలీవాల్ కూడా ఉదయం 7.30 నిమిషాలకే ఆఫీసులకు వెళ్లారు.
తెల్లవారుజామునే ఆఫీసుకు వెళ్లడం వల్ల విద్యుత్తును ఆదా చేయవచ్చు అని సీఎం మాన్ తెలిపారు. ప్రస్తుతానికి పవర్ షార్టేజీ ఏమీ లేదని, కానీ ఉదయమే ఆఫీసులకు వెళ్లడం వల్ల దాదాపు రోజుకు 350 మెగా వాట్ల విద్యుత్తును ఆదా చేయవచ్చు అన్నారు. విద్యుత్తు బిల్లులను తగ్గిస్తే, రాష్ట్ర ఖజానాకు దాదాపు నెలకు 17 కోట్ల వరకు బిల్లు ఆదా చేసినట్లు అవుతుందన్నారు. పరిశ్రమలు, గృహ వినియోగదారులకు కరెంటు కోతలు ఉండవన్నారు. వరి పంటకు అందించేందుకు కావాల్సినంత విద్యుత్తు ఉందన్నారు.
ਪੰਜਾਬ ‘ਚ ਇੱਕ ਨਵੇਕਲੀ ਸ਼ੁਰੂਆਤ…
ਅੱਜ 7:28 ਵਜੇ ਸਿਵਲ ਸਕੱਤਰੇਤ,ਪੰਜਾਬ ਵਿਖੇ ਆਪਣੇ ਦਫ਼ਤਰ ਪਹੁੰਚਿਆ…ਕੰਮ ਕਾਜ ਕੀਤਾ ਤੇ ਵੇਖਕੇ ਖੁਸ਼ੀ ਹੋਈ ਸਾਡੇ ਮੁਲਾਜ਼ਮ ਤੇ ਅਫ਼ਸਰ ਸਮੇਂ ਸਿਰ ਆਪਣੇ ਦਫ਼ਤਰ ਪਹੁੰਚੇ ਨੇ…ਪੰਜਾਬ ਦੇ ਲੋਕ ਤੇ ਉਹਨਾਂ ਦੇ ਕੰਮ ਸਾਡੇ ਸਾਰਿਆਂ ਲਈ ਪਹਿਲਾਂ ਨੇ…ਉਮੀਦ ਕਰਦਾ ਹਾਂ ਤੁਹਾਡਾ ਸਾਰਿਆਂ ਦਾ ਦਿਨ ਅੱਜ ਵਧੀਆ ਲੰਘੇ… pic.twitter.com/ucdj6yLCIP
— Bhagwant Mann (@BhagwantMann) May 2, 2023
వేసవి కారణంగా మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉంటుందని, ఆఫీసు వేళల మార్పును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాన్ తెలిపారు. సూర్యుడి వెలుతురును సంపూర్ణంగా వాడుకునేందుకు దాదాపు చాలా దేశాల్లో ప్రజలు తమ వాచీలను సీజన్ ప్రకారం మార్చుకుంటారని తెలిపారు. జూలై 15వ తేదీ వరకు కొత్త ఆపీస్ అవర్స్ పని చేయనున్నాయి.