చండీగఢ్, డిసెంబర్ 18 : తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన రైల్ రోకో ఆందోళనతో బుధవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు రైతులు పలుచోట్ల పట్టాలపై బైఠాయించి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారని కిసాన్ మజ్దూర్ మోర్చా నేత శర్వన్ సింగ్ పంఢేర్ తెలిపారు. 30న పంజాబ్ బంద్ చేపట్టనున్నట్టు వెల్లడించారు.