చంఢీఘడ్: పంజాబ్ మాజీ పోలీసు చీఫ్ సుమేద్ సింగ్ సైనికి .. సీబీఐ ప్రత్యేక కోర్టు వార్నింగ్ ఇచ్చింది. 1994లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో సైని ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే మంచంపై పడుకుని సుమేద్ సింగ్ విచారణలో వర్చువల్గా పాల్గొన్నారు. ప్రత్యేక సీబీఐ జడ్జి సంజీవ్ అగర్వాల్ దీన్ని తప్పుపట్టారు. ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. కోర్టు మర్యాదలు పాటించాలని సైనికి వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న మాజీ పోలీసు చీఫ్ కోర్టుకు ఎటువంటి మెడికల్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయలేదని, కేసులో ప్రధాన నిందితుడైన సైని.. కోర్టు మర్యాదలు పాటించాలని జడ్జి తన తీర్పులో తెలిపారు. లుథియానాలో 1994లో ముగ్గుర్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో సైని నిందితుడు.