చండీగఢ్‌లో పంజాబ్ సీఎం భగవత్మాన్ సింగ్ పెళ్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతోపాటు ఎంపికచేసిన ఆహ్వానితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విటర్లో చద్దా షేర్ చేశారు.
మాన్ తల్లి, సోదరి, బంధువులు, కొంతమంది అతిథులతో సహా కుటుంబ సభ్యులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహ వేడుక కోసం రాఘవ్ చద్దా బుధవారం సాయంత్రం చండీగఢ్ చేరుకున్నాడు. “నా ‘వడ్డే వీర్’ (అన్నయ్య) మన్ సాబ్, డాక్టర్ గురుప్రీత్ కౌర్‌కు సంతోషకరమైన, ఆశీర్వాదమైన వైవాహిక జీవితం కోసం శుభాకాంక్షలు” అని చద్దా ట్వీట్ చేశారు.
48 ఏళ్ల భగవత్మాన్కు ఇది రెండో పెళ్లి. ఆయన 2015లో తన మొదటి భార్య నుంచి విడిపోయాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. భగవత్మాన్ భార్య గురుప్రీత్ కౌర్‌ది హర్యానాలోని కురుక్షేత్రలోని పెహోవా. నాలుగేళ్ల క్రితం హర్యానాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసింది.