చండీఘడ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్(CM Bhagwant Mann).. అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం అర్థరాత్రి ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. మూడు సార్లు ఆయన స్పృహ కోల్పోయిన నీరసించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎటువంటి అనారోగ్యంతో బాదపడుతున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఫోర్టస్ ఆస్పత్రి మాత్రం సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ప్రకటన చేయలేదు. కొన్ని రోజుల క్రితం లో బీపీ ఉన్నట్లు సీఎం మాన్ ఫిర్యాదు చేశారు. ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి మొహాలీకి చేరుకున్నారు.