Pune Porsche Case | పుణె: పుణెలో విచక్షణారహితంగా పోర్షే కారును నడిపి, ఇద్దరి మృతికి కారకుడైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు నేరాన్ని అంగీకరించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పూటుగా మద్యం సేవించినట్లు అతడు తెలిపాడు.
జరిగిన సంఘటనలు తనకు పూర్తిగా గుర్తు లేవని వెల్లడించాడు. మరోవైపు బాలుడి తల్లిదండ్రులకు ఈ నెల 5 వరకు పోలీసు కస్టడీకి పుణే కోర్టు ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మూడు కేసుల దర్యాప్తుకు 100 మంది పోలీసులను నియమించారు.