పుణె : మూడేండ్ల్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వృద్ధుడికి పుణె స్పెషల్ కోర్టు మరణశిక్ష విధించింది. సమాజంలో ప్రతి ఒక్కరినీ కలిచివేసే కేసు ఇది అని పుణె సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ఆర్ సలుంఖే తెలిపారు. పుణెలోని నస్రాపూర్ గ్రామంలో మే1న ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన భీమ్రావు కుంబ్లే ఓ మూడేండ్ల చిన్నారికి అప్పుడే పుట్టిన దూడను చూపిస్తానంటూ తీసుకెళ్లాడు.
ఎవరూ లేని పశువుల పాకలోకి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బండరాయితో కొట్టి దారుణంగా చంపేశాడు. తల్లిదండ్రులు పాప కోసం వెతకగా విగతజీవిగా కనిపించింది. భీమ్రావు పాపను ఎత్తుకెళ్తున్నట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.