ముంబై: మహారాష్ట్రలోని పూణే విమానాశ్రయాన్ని ఈ నెల 16 నుంచి 14 రోజులపాటు మూసివేయనున్నారు. విమానాశ్రయంలోని రన్ వే అక్టోబర్ 15 రాత్రి 8 గంటల నుంచి అక్టోబర్ 29 వరకు మూసి ఉంటుందని, 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి విమాన సర్వీసులను పునరుద్ధిస్తామని పూణే ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. రన్ వే రీ సర్వీసింగ్ పనులను ఎయిర్ ఫోర్స్ చేపడుతుందని, ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు రన్ వే మూసి ఉంటుందని తెలిపారు.
మరోవైపు దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండగల సమయంలో వాణిజ్యపరంగా కీలకమైన పూణే ఎయిర్ పోర్ట్ మూసివేతపై విమానయాన సంస్థలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
కాగా, ఐఏఎఫ్ శిక్షణ కేంద్రంలోనే పూణే ఎయిర్పోర్టును నిర్వహిస్తున్నారు. భూసేకరణ సమస్యల నేపథ్యంలో పురందర్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
This is to inform all passengers that as per information received from Indian Air Force (IAF), due to runway resurfacing works, all flights from #PuneAirport will not operate for 14 days from 16 October 2021 to 29 October 2021.@AAI_Official @aairedwr @Pib_MoCA @DGCAIndia
— Pune Airport (@aaipunairport) October 5, 2021