న్యూఢిల్లీ : జర్మన్ స్పోర్ట్స్వేర్ బ్రాండ్ ‘పుమా’ ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 13 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపబోతున్నది.
కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పడిపోవటంతో, 2026 నాటికి దాదాపు 900 ఉద్యోగాల్లో కోత విధించాలని సంస్థ నిర్ణయించింది. మూడో త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 10.4శాతం పడిపోయినట్టు ‘పుమా’ పేర్కొన్నది.