పుదుచ్చేరి: పుదుచ్చేరి సీఎం రంగస్వామిని ‘కీలుబొమ్మ సీఎం’గా తమిళనాడు సీఎం స్టాలిన్ వర్ణించారు. పుదుచ్చేరి పాలన విషయంలో ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ముందు లొంగిపోయారని, యూటీలో ప్రభుత్వాన్ని తమిళిసైనే నడుపుతున్నారన్నారు. సోమవారం స్టాలిన్ మాట్లాడుతూ ‘రంగస్వామి హైట్ పరంగా పొడుగ్గా ఉంచొచ్చు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటుంటే.. దాన్ని సీఎం రంగస్వామి గట్టిగా వ్యతిరేకించకుండా ఉండటం సరికాదు’ అని అన్నారు.