చెన్నై: PSLV-XL రాకెట్‌కు చెందిన బూస్టర్ మోటార్‌ను ఇస్రో పరీక్షించింది. అయితే ఆ పరీక్షలో బూస్టర్ మోటార్ పనితీరును సమీక్షించారు. ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ ఈ బూస్టర్‌ను రూపొందించింది. ఈ బూస్టర్ మోటార్‌ను PSOM-XL అని పిలుస్తున్నారు. శ్రీహరికోటలో బుధవారం ఈ పరీక్ష జరిగింది. పీఎస్ఎల్వీ రాకెట్ల కోసం ప్రైవేటు కంపెనీలు బూస్టర్లు డెవలప్ చేస్తున్నాయని ఈ నేపథ్యంలో ఇస్రో తెలిపింది. ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ సంస్థ నాగపూర్‌లో ఉంది. బూస్టర్ టెక్నాలజీని ఆ కంపెనీకి 2019లో ఇస్రో బదిలీ చేసింది.