న్యూఢిల్లీ: ఇస్రో ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 మిషన్ను ప్రయోగించనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. ఇస్రోకు ఇది 101వ మిషన్. తదుపరి తరం భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-09 (రిసాట్-1బి)ను పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ మోసుకెళ్తుంది.
ఈ ఉపగ్రహం బరువు 1,696 కేజీలు. ఈ ప్రయోగం 17 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ మిషన్ జీవిత కాలం ఐదేళ్లు.