బెంగళూరు: సరికొత్త అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. రెండు శాటిలైట్స్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టడమేగాక, ఆ రెండింటినీ కలుపుతూ(డాకింగ్), విడగొడుతూ(అన్‌డాకింగ్) ‘స్పేస్ డాకింగ్’ అనే ప్రక్రియను ఇస్రో ప్రదర్శించబోతున్నది. ఇందుకోసం పీఎస్ఎల్వీ-సీ60 మిషన్‌ను ఈ నెల 30న ప్రయోగిచనుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రలు, భారతీయ అంతరిక్ష స్టేషన్(బీఏఎస్) నిర్మాణానికి కీలకమైన ‘స్పేస్ డాకింగ్ టెక్నాలజీ’ని ఈ మిషన్ ద్వారా పరీక్షించనున్నారు.