PSLV-C56 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C56)తో పలు ఉపగ్రహాలను జులై 30న ప్రయోగించనున్నది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సింగపూర్‌కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతో పాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లనున్నది. సింగపూర్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ ప్రధాన పేలోడ్గా ఉంటుందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. కమర్షియల్ పీఎస్ఎల్వీ మిషన్‌లో భాగంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) తరఫున ఏడు ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది.
ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్ఎల్వీ-ఎస్ ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగించనున్నారు. డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహం బరువు 360 కిలోలు. సింగపూర్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ), ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం పగలు-రాత్రి కవరేజీని అందివ్వనున్నది. ఇది పూర్తి పోలారిమెట్రీ వద్ద 1 మీ-రిజల్యూషన్ వద్ద ఇమేజింగ్ చేయగలదు. సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు సేవలందించనున్నది. దీంతో మరో ఆరు ఉపగ్రహాలను ఉన్నాయి.