కోల్కతా: ఒక స్థలంలోకి ప్రవేశించిన ఏనుగును రెచ్చగొట్టేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. జేసీబీతో దానిపై దాడి చేశారు. ఆ ఏనుగు ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. (Provoked Elephant Charges On JCB) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 1న మల్బాజార్ ప్రాంతంలోని మట్టి స్థలంలోకి ఒక పెద్ద ఏనుగు వచ్చింది. అక్కడున్న వారు ఆ ఏనుగును రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి జేసీబీతో ఏనుగుపై దాడి చేశాడు. దీంతో జేసీబీని పైకి ఎత్తేందుకు అది ప్రయత్నించింది.
కాగా, జేసీబీ దాడిలో ఆ ఏనుగు తొండం, ముఖానికి గాయమైంది. దీంతో అది వెనక్కి తగ్గింది. అక్కడి నుంచి వెళ్తుండగా జేసీబీతో దానిని తరిమేందుకు ప్రయత్నించారు. అలాగే కొందరు వ్యక్తులు దాని వెంటపడ్డారు. ఒకరు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై ఫిర్యాదు అందటంతో పోలీసులు స్పందించారు. ఏనుగును రెచ్చగొట్టి, జేసీబీ యంత్రంతో దాడి చేసిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today.
In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN
— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025