బెంగళూరు : కన్నడ నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్లకుపైగా ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది. ఈడీ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్లో ఉన్న ఇల్లు, అర్కవతి లేఅవుట్లోని ఇంటి స్థలం, తుమకూరులోని పారిశ్రామిక భూమి, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూములను జప్తు చేశారు. వీటి మార్కెట్ విలువ రూ.34.12 కోట్లు ఉంటుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య తీసుకున్నారు. సీబీఐ, డీఆర్ఐల ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్ఏ కేసును ఈడీ నమోదు చేసింది. ఆమెను మార్చి 3న డీఆర్ఐ అరెస్టు చేసింది.