న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఇప్పటివరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్సభకు ఉప ఎన్నికను నవంబర్ 13న నిర్వహిస్తామని ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది.
ఈసీ ప్రకటన వెలువడిన వెంటనే వయనాడ్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ప్రియాంక అక్కడ పోటీ చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి పార్టీ రంగం సిద్ధం చేసింది.