న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : జమిలి ఎన్నికల బిల్లులను అధ్యయనం చేయనున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సభ్యులపై స్పష్టత వచ్చింది. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పాటుకానుంది. జేపీసీలో లోక్సభ నుంచి బీజేపీ తరఫున పీపీ చౌదరి, బన్సూరి స్వరాజ్, అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ, మనీశ్ తివారి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ, ఎన్సీపీ(ఎస్పీ) నుంచి సుప్రి యా సూలె పేర్లను ప్రతిపాదించారు.