Priyanka Chaturvedi : దేశంలో ఎమర్జెన్సీ చీకటి రోజులను ప్రధాని నరేంద్ర మోదీ మనకు గుర్తుచేశారని, అయితే ఇవాళ దేశంలో నెలకొన్న ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ సంగతేంటని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.
పరీక్షల రద్దు, పేపర్ లీక్‌లు, పరీక్షలపై సీబీఐ విచారణల గురించి దేశ యువత నిలదీస్తోందని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న కీలక అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలం ఎంపీగా ఎన్నికైన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే ఆనవాయితీ ఉందని, కానీ ప్రధాని మోదీ తాను ఏం కోరుకుంటే అది చేస్తున్నారని దుయ్యబట్టారు.
మోదీ రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ పద్ధతులు, సంప్రదాయాలనూ మార్చేస్తారని ఆరోపించారు. ఇక ఈసారి పాలక పార్టీకి దీటుగా విపక్షం పటిష్టంగా ఉందని ప్రియాంక చతుర్వేది చెప్పుకొచ్చారు.
Read More :
Nagarjuna | అభిమానికి హీరో నాగార్జున క్షమాపణ.. ఎందుకంటే?