న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని జార్ఖండ్ వెళ్లారు. దేవఘర్లో ఆయన విమానానికి సాంకేతిక సమస్య వచ్చింది. సాంకేతిక సమస్యను ఫిక్స్ చేసే వరకు ఆ విమానం అక్కడే ఉండనున్నది. దీంతో ఢిల్లీలో వెళ్లాల్సిన ప్రధాని తిరుగుప్రయాణం మరింత ఆలస్యం కానున్నది. ఇవాళ జార్ఖండ్‌లో ప్రధాని మోదీ రెండు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. నవంబర్ 20వ తేదీన జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నది.
అయితే దేవఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో .. జార్ఖండ్‌లోని గోడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్‌కు కూడా ఇవాళ సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఆయన హెలికాప్టర్ 45 నిమిషాల పాటు గ్రౌండ్పైనే ఉండిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ కోసం రాహుల్ ఎదురు చూశారు. అసెంబ్లీ ప్రచారాన్ని అడ్డుకోవాలనే రాహుల్ హెలికాప్టర్‌కు సమస్య వచ్చేలా చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
బీహార్‌లోని జాముయిలో గిరిజనుల కోసం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాలను నిర్వహించారు.