న్యూఢిల్లీ : ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయనను ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నానని, 140 కోట్ల మంది భారతీయుల తరపున దీనిని స్వీకరిస్తున్నానని మోదీ చెప్పారు.
ఆయనకు ఈ పురస్కారాన్ని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్ల పెర్సద్-బిస్సెస్సర్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దృఢమైన చారిత్రక అనుబంధం ఉందని తెలిపారు.