న్యూఢిల్లీ: ఆధార్ పీవీసీ కార్డు ధరను రూ.రూ.50 నుంచి రూ.75కు పెంచుతూ భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్) తీసుకున్న నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. పీవీసీ కార్డ్ అనేది ప్లాస్టిక్‌తో తయారుచేసిన పాకెట్ సైజ్ వెర్షన్. డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు పరిమాణంలో ఉండేలా, ఆధార్ పేపర్ వెర్షన్ కంటే ఎక్కువ మన్నికైనదిగా రూపొందించారు. దీనిని మైఆధార్ వెబ్సైట్, మైఆధార్ మొబైల్ యాప్ ద్వారా పౌరులు ఆర్డర్ చేయవచ్చు.