Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Presidents Bodyguard: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వర్తించే ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ రెజిమెంట్‌లోని ఓ జవానుపై కాల్పులు జరిగాయి. 28 ఏళ్ల జవాను సౌరభ్ తోమర్‌పై అతని స్వగ్రామంలో అటాక్ జరిగింది. పాత శత్రువులు అతని తలలో కాల్చారు.
మీరట్: ఎలైట్ ప్రెసిడెంట్స్ బాడీగార్డ్(Presidents Bodyguard) రెజిమెంట్‌లో జవానుగా చేస్తున్న వ్యక్తిపై కాల్పులు జరిగాయి. దివాళీ రాత్రి భాగ్పాత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని 28 ఏళ్ల సౌరభ్ తోమర్‌గా గుర్తించారు. అయితే స్వంత గ్రామానికి చెందిన పాత శత్రువులే ఆ ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో అతని సోదరుడు కూడా గాయపడ్డారు. అయితే జవాను సౌరభ్ తోమర్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఇద్దరు నిందితులపై హత్యాయత్నం కేసు బుక్ చేశారు. ఆ ఇద్దరూ పరారీలో ఉన్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ బృందం విధులు నిర్వర్తిస్తుంటుంది. దీపావళి పండుగ కోసం బాధిత జవాను తోమర్ తన స్వగ్రామం గోపాల్‌పుర్ ఖాదానాకు వెళ్లారు. ఇంటి బయట నిలుచున్నసమయంలో నిందితులు ధీరజ్, మోనూలు కాల్పులు జరిపారు. తోమర్ తండ్రి జనకరాజ్ ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. బీఎన్ఎస్లోని 109(1), 115(2), 352, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2021లో సౌరభ్ తోమర్ రాష్ట్రపతి బాడీగార్డు రెజిమెంట్‌లో చేరారు. 6 అడుగుల 3 ఇంచుల ఎత్తు ఉన్న సౌరభ్ ఎలైట్ యూనిట్‌కు క్వాలిఫై అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత రాష్ట్రపతికి ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ యూనిట్ సెక్యూర్టీ విధులను నిర్వర్తిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

