Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
Deepika | పోలీస్ విధులు నిర్వహిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ తెలంగాణ పోలీస్ శాఖకు గుర్తింపు తెస్తున్నారు మహిళా కానిస్టేబుల్ నందిపాటి దీపిక. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్-5లో వాలీబాల్‌లో స్వర్ణ పతకం, కబడ్డీలో రజత పతకం సాధించి సత్తా చాటారు.
Deepika | పెన్‌పహాడ్: పోలీస్ విధులు నిర్వహిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ తెలంగాణ పోలీస్ శాఖకు గుర్తింపు తెస్తున్నారు మహిళా కానిస్టేబుల్ నందిపాటి దీపిక. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్-5లో వాలీబాల్‌లో స్వర్ణ పతకం, కబడ్డీలో రజత పతకం సాధించి సత్తా చాటారు. అంతేకాకుండా 2027లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు డిఫెండర్‌గా ఎంపికయ్యారు.
సూర్యాపేట జిల్లా పొనుగోడు గ్రామానికి చెందిన దీపిక ప్రస్తుతం పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. పాఠశాల, కళాశాల స్థాయిల్లో నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. పోలీస్ శాఖలో చేరిన తర్వాత కూడా క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.
గత మూడేళ్లుగా తెలంగాణ పోలీస్ జట్టు తరఫున జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో దీపిక పాల్గొంటున్నారు. 2025లో పంజాబ్‌లో, 2026లో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. తాజాగా వరంగల్‌లో జరిగిన తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్-5లో రెండు పతకాలు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు డిఫెండర్‌గా ఎంపికై మరో ఘనత సాధించారు.
దీపిక క్రీడా విజయాల వెనుక తండ్రి నాగేంద్రబాబు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కీలకంగా ఉంది. ఇటీవల సాధించిన విజయాలపై జిల్లా ఎస్పీ నరసింహ ఆమెను శాలువా, పూలమాలతో సత్కరించి అభినందించారు. పోలీస్ విధులతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న దీపికను పెన్‌పహాడ్ ఎస్ఐ బాలునాయక్, సహచర సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

