బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
పల్నాడు జిల్లాలోని ఓ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థినుల జడలను దుండగులు కత్తిరించారు.
పల్నాడు జిల్లాలోని ఓ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థినుల జడలను దుండగులు కత్తిరించారు. గురుకులంలోని మొత్తం10 మంది బాలికల జుట్టు కత్తిరించినట్లు సమాచారం. ఈ ఘటన బయటకు రావడంతో పాఠశాలలో ఆందోళన నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రామకృష్ణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థినులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారి జడలను ఎవరో కత్తిరించారు. ఉదయం నిద్రలేచిన తర్వాత జుట్టు కత్తిరించి ఉండటాన్ని గమనించిన బాలికలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటకు రావడంతో పాఠశాల పరిసరాల్లో కలకలం రేగింది.
తమ పిల్లలకు భద్రత ఉంటుందనే నమ్మకంతో గురుకుల పాఠశాలలో చేర్పిస్తే ఇలాంటి ఘటన జరగడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఉంటే రాత్రి వేళ భద్రతా సిబ్బంది, వార్డెన్ పర్యవేక్షణ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఇలాంటి ఘటన ఎలా జరిగిందని నిలదీస్తున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థినులే కత్తిరించుకున్నారన్న హెచ్ఎం
మరోవైపు ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజనీకుమారిని వివరణ కోరగా.. ఇటీవల ప్రభుత్వం అందించిన స్టేషనరీ కత్తెరలతో విద్యార్థినులే ఒకరి జుట్టును మరొకరు కత్తిరించుకున్నారని ఆమె తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఎస్సై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థినులు, పాఠశాల సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు పాఠశాల రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టారు. బయటి వ్యక్తులు హాస్టల్లోకి ప్రవేశించారా? లేక పాఠశాలలో చదువుతున్న ఆకతాయి విద్యార్థులే ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

