IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
IPL 2027: ముంబై, పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ ప్లేయర్ ట్రేడింగ్ జరిగింది. ముంబై ప్లేయర్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్ నుంచి పంజాబ్ జట్టుతో కలవనున్నాడు. ఇక బౌలర్ అర్షదీప్ సింగ్ .. పంజాబ్ నుంచి ముంబైలో చేరనున్నారు. దీనిపై ఐపీఎల్ ఇవాళ అధికారిక ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్లో హార్దిక్ పాండ్యాపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఆల్‌రౌండర్ హార్దిక్ ఇక నుంచి పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నారు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్ష్ జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఐపీఎల్ స్పష్టం చేసింది. రెండు ఫ్రాంచైజీలు ఇష్ట ప్రకారమే ఆటగాళ్లను మార్చుకున్నాయి. దీనికి సంబంధించిన పేపర్ వర్క్‌ను కూడా సోమవారమే బీసీసీఐకి అందజేసినట్లు తెలిసింది. టాటా ఐపీఎల్ 2027(IPL 2027) సీజన్ కోసం ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టుతో కలవనున్నాడు.
ఇక టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టుతో కలుస్తాడని ఐపీఎల్ తన స్టేట్మెంట్లో తెలిపింది. 18 కోట్ల ప్రైజ్‌మనీతో పాండ్యా పంబాజ్ జట్టులో చేరనున్నాడు. ముంబైలో అతనికి 16.35 కోట్ల ప్రైజ్‌మనీ ఉంది. ఇక బౌలర్ అర్షదీప్ ప్రస్తుతం ఉన్న 18 కోట్ల ఫీజుకే పంజాబ్ జట్టుతో కలవనున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు 2019 నుంచి అర్షదీప్ ఆడుతున్నాడు. అతను 96 మ్యాచుల్లో 111 వికెట్లు తీశాడు. అయితే తొలిసారి అర్షదీప్ తన స్వంత ఫ్రాంచైజీని వీడుతున్నాడు.
The trade confirmation you have been waiting for is HERE!
Two marquee #TeamIndia stars, two franchise and a blockbuster trade 🎇
Hardik Pandya heads to @PunjabKingsIPL and Arshdeep Singh moves to @mipaltan.
📌 Hardik will join #PBKS at a revised fee of INR 18 crore, up from 16.5 crores.
📌 Arshdeep will join #MI at his existing fee of INR 18 crore
Details ▶️ https://t.co/i4RpaGg2BE
#TATAIPL2027
— IndianPremierLeague (@IPL) November 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

