Droupadi Murmu : కేంద్ర హోంమంత్రి (Union Home minister) అమిత్ షా (Amit Shah) కు రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఫోన్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఆమె ఆరా తీశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఢిల్లీ (Delhi) లోని రెడ్‌ఫోర్ట్ (Red fort) సమీపంలో సోమవారం రాత్రి I20 కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారికి లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతిచెందారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 12కు పెరిగింది. కాగా దీనిని ఆత్మాహుతి దాడిగా పోలీసుల భావిస్తున్నారు. వైద్యుడు అయిన ఉమర్ అహ్మద్ అనే వ్యక్తి కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని అంచనా వేస్తున్నారు.