కార్వార్ : భారత రాష్ట్రపతి, సాయుధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము ఆదివారం కర్ణాటక తీరంలో ఐఎన్ఎస్ వాఘ్షీర్లో ప్రయాణించారు. అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు పొందారు. నౌకాదళ యూనిఫామ్ ధరించిన ముర్ము నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠితో కలిసి కార్వార్ తీరంలో ఈ ప్రయాణం చేశారు.
ప్రపంచంలోని అత్యాధునిక జలాంతర్గాముల్లో ఒకటైన ఈ సబ్ మెరైన్ను జల ఉపరితల యుద్ధాలు, నిఘా, ప్రాంతీయ సర్వే, ప్రత్యేక ఆపరేషన్లకు ఉపయోగిస్తారు.