న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తొట్టతొలిసారి అత్యున్నత సైన్స్ పురస్కారాన్ని(Rashtriya Vigyan Puraskar) అందజేసింది. ప్రఖ్యాత బయోకెమిస్ట్, బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్‌ను విజ్ఞాన రత్న అవార్డుతో సత్కరించారు. రాష్ట్రపతిభవన్‌లో ఉన్న గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ పురస్కారాన్ని ఇవాళ అందజేశారు. 13 విజ్ఞాన్ శ్రీ పురస్కార్, 18 విజ్ఞాన్ యువ -శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌లు, ఒక విజ్ఞాన్ టీమ్ అవార్డును కూడా రాష్ట్రపతి అందజేశారు. చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కింది. ప్రాజెక్టు డైరెక్టర్ పీ వీరముత్తువేల్ ఆ అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీతలందరికీ ఓ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు.
President Droupadi Murmu presents Vigyan Ratna Award to Prof. Govindarajan Padmanabhan for lifetime achievement and contributions in the field of Science and Technology. Prof. Padmanabhan is a pioneer in molecular biology and biotechnology research in India. pic.twitter.com/NyMbP0cFrK
— President of India (@rashtrapatibhvn) August 22, 2024