Kiran Abbavaram | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ‘బేబీ’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథను అందించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై SKNతో కలిసి ఆయన ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మ్యాడ్’, ‘లవర్’ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరి ప్రియ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో జతకడుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
This Summer ❤️#ChennaiLovestory #MassMoviemakers #AmruthaProductions #HappyNewYear pic.twitter.com/yPJhzznfSZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 1, 2026