న్యూఢిల్లీ, ఆగస్టు 21: లైంగికదాడి కారణంగా గర్భం దాల్చిన వారు శారీరక, మానసిక క్షోభకు గురవుతారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లైంగికదాడి బాధితురాలి గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇస్తూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. లైంగికదాడి వల్ల దాల్చిన గర్భం బాధితులకు ఇష్టపూర్వకం కాదని పేర్కొంది. గర్భ విచ్ఛిత్తికి అనుమతి కోరుతూ గుజరాత్‌కు చెందిన ఓ బాధితురాలు పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. బాధితురాలి 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి నిరాకరించిన గుజరాత్ హైకోర్టు తీరును ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. విచారణ పేరుతో విలువైన సమయాన్ని వృథా చేశారని తప్పుబట్టింది. బాధితురాలి వైద్య నివేదికలను పరిశీలించిన ధర్మాసనం… తక్షణమే గర్భ విచ్ఛిత్తికి అనుమతులు జారీ చేసింది.