Prashant Kishor | చెన్నై: టీవీకే అధినేత విజయ్ విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంవత్సరం కిందట చెప్పిన జోస్యం నిజమైంది! మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన టీవీకే తమిళనాడులో రెండు పెద్ద పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించింది.
ఈ ఫలితంపై నిరుడు మార్చిలో ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ..‘నాకు అర్థమైనది, డాటా సూచించిన దాని ప్రకారం అతడు(విజయ్) ఒంటరిగా బరిలో దిగితే తమిళనాడును గెలుచుకొనే అవకాశం ఉన్నది. రాబోయే 10-12 నెలలు ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడి నుంచి ఆశించే బాధ్యతలను విజయ్ సక్రమంగా నిర్వహించాలి’ అని అన్నారు. ‘ఈ వీడియోను భద్రపరచుకొని ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మళ్లీ చూడండి’ అని వ్యాఖ్యానించారు.