పాట్నా, మే 31: కాంగ్రెస్ పార్టీలోకి తాను ఎప్పటికీ చేరబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేతులు జోడిస్తూ అన్నారు. బీహార్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కిందపడటమే కాకుండా తనతో పాటు అందరినీ పాతాళానికి తీసుకుపోబోతుందని జోస్యం చెప్పారు.