Waves OTT | న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి బుధవారం తన ఓటీటీ యాప్ ‘వేవ్స్’ను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు దూరదర్శన్, ఆకాశవాణి ఆర్కైవ్స్‌ను వీక్షించవచ్చు, వినవచ్చు. అదేవిధంగా 40 లైవ్ టీవీ చానల్స్‌ను కూడా పొందవచ్చు. బీ4యూ, ఏబీజెడ్వై, ఎస్‌ఏబీ గ్రూప్, 9ఎక్స్ మీడియా, ఇండియా టుడే, న్యూస్ నేషన్, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ న్యూస్, న్యూస్ 24, ఎన్డీటీవీ ఇండియా వంటివాటిని చూడవచ్చు. గోవాలో ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ విలేకర్లతో మాట్లాడుతూ, కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందించగలిగే కార్యక్రమాలను వేవ్స్ ద్వారా అందజేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.