బెంగళూరు, మే 10: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్‌పై నమోదైన సెక్స్ స్కాండల్ కేసు కొత్త మలుపు తీసుకొంది. కొందరు తనను వేధించి బలవంతంగా తనతో ప్రజ్వల్‌పై తప్పుడు ఫిర్యాదు చేయించారని ఓ మహిళ తమకు తెలిపిందని జాతీయ మహిళా కమిషన్ గురువారం వెల్లడించింది. దీనిపై జేడీఎస్ కర్ణాటక యూనిట్ అధ్యక్షుడు కుమారస్వామి స్పందిస్తూ….బాధిత మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వకపోతే, వ్యభిచారం కేసులు నమోదు చేస్తామని వారిని సిట్ బెదిరిస్తున్నదని ఆరోపించారు.
దర్యాప్తు ఇలాగేనా చేసేది అని ఆయన సిట్‌ను ప్రశ్నించారు. ‘కిడ్నాప్‌కు గురైన మహిళను కోర్టు ముందు ఎందుకు హాజరు పరచలేదు’ అని ఆయన ప్రశ్నించారు. కుమారస్వామి వ్యాఖ్యలపై రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. ‘వాళ్లు కావాలనుకొంటే సిట్ మీద ఫిర్యాదు చేయవచ్చు’ అని తెలిపారు.