న్యూఢిల్లీ: రెండు చేతులు కోల్పోయి.. దీనంగా చూస్తున్న ఈ చిన్నారిని చూశారా. తొమ్మిదేళ్ల ఈ పాలస్తీనా కుర్రాడు.. గాజాలో జరుగుతున్న మారణహోమానికి నిదర్శనం. ఈ ఫోటోను తీసిన సమర్ అబూ ఎలోఫ్కు.. 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్(World Press Photo) అవార్డు దక్కింది. ఫోటో జర్నలిస్టు సమర్ అబూ.. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు పనిచేస్తున్నారు. ఫోటోలో ఉన్న తొమ్మిదేళ్ల కుర్రాడి పేరు మహమూద్ అజ్జౌర్. ప్రస్తుతం ఈ కుర్రాడు దోహ, ఖతార్‌లో చికిత్స పొందుతున్నాడు. గాజా యుద్ధం వల్ల ఈ చిన్నారికి ఈ దుస్థితి వచ్చింది.
మహమూద్ చేతులు కోల్పోయిన సందర్బం గురించి అతని తల్లి వివరించింది. ఇప్పుడు నేనెలా నిన్ను హత్తు కోవాలని ఆ పిల్లవాడు వేసిన తొలి ప్రశ్నను ఆమె గుర్తు చేశారు. వరల్డ్ ప్రెస్ ఫోటో జ్యూరీ ఈ ఫోటోను మెచ్చుకున్నది. ఫోటో చాలా భావోద్వేగం ఉన్నట్లు పేర్కొన్నది. యుద్ధాల వల్ల చిన్నారులపై పడే దీర్ఘకాలిక ప్రభావం ఇదే అన్న రీతిలో ఈ ఫోటోను తీసినట్లు జ్యూరీ తెలిపింది.
The #WPPh2025 Photo of the Year is ‘Mahmoud Ajjour, Aged Nine’ by @samarabuelouf, for @nytimes. The jury was moved by this portrait of a Palestinian boy which speaks to the devastating long-term costs of war on civilians. Read more: https://t.co/KHmkUjt2Rj pic.twitter.com/QP3lqEBWaR
— World Press Photo (@WorldPressPhoto) April 17, 2025
ప్రస్తుతం తన కాళ్లతో ఆడడం, రాయడం, డోర్లు ఓపెన్ చేయడం లాంటివి నేర్చుకుంటున్నాడు. త్వరలో అతనికి ప్రోస్థటిక్స్ చేతులను అమర్చనున్నారు. ప్రెస్ ఫోటో అవార్డు కోసం 59,320 ఎంట్రీలు వచ్చాయి. సుమారు 3778 మంది జర్నలిస్టులు వీటిని సబ్మిట్ చేశారు. అయితే పాలస్తీనా కుర్రాడి పోట్రేయిట్ ఫోటోను వరల్డ్ ప్రెస్ ఫోటో దఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు.