జైపూర్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజస్థాన్లోని కోటాలో యూనిటీ మార్చ్ నిర్వహించింది. సేవ్ ద రిపబ్లిక్ పేరుతో భారీ బహిరంగ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ను కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. అయితే రాజస్థాన్లో మాత్రం ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. ఫిబ్రవరి 17 పీఎఫ్ఐ వ్యవస్థాపక దినోత్సవం.
ఈ నేపథ్యంలో కోటాలోని నయాపురా స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహించేందుకు జిల్లా అధికారులు పీఎఫ్ఐకి అనుమతి ఇచ్చారు. అయితే అనుమతి లేకపోయినా ‘యూనిటీ మార్చ్’ని ఆ సంస్థ నిర్వహించింది. వేలాది మంది ముస్లిం మహిళలు, చిన్నారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం(ఏఎఫ్ఎస్పీఏ), యూఏపీఏ, పీఎస్ఏ, ఎన్ఎస్ఏ వంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
హిజాబ్ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
#WATCH | Popular Front of India (PFI) has organised a ‘unity march’ in Rajasthan’s Kota on the occasion of its foundation day
Permission to organise ‘unity march’ was denied by district admin in its order copy however admin permitted them to organise a public rally at a stadium pic.twitter.com/DdlXUR8XqC
— ANI (@ANI) February 17, 2022