జైపూర్: పోలింగ్ బూత్ వద్ద షాకింగ్ సంఘటన జరిగింది. పోలింగ్ అధికారి అయిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) చెంపపై స్వతంత్ర అభ్యర్థి కొట్టాడు. (Poling Official Slapped By Independent Candidate) అక్కడున్న పోలీసులు, ఇతరులు ఆయనను నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖాళీ అయిన డియోలి-యునియారా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. బుధవారం పోలింగ్ సందర్భంగా సంరవత పోలింగ్ కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా దరుసుగా ప్రవర్తించాడు. పోలింగ్ బూత్ నుంచి బయటకు ఆయన పరుగున వచ్చాడు. ఎన్నికల ప్రోటోకాల్ పర్యవేక్షించడానికి డ్యూటీలో ఉన్న ఎస్డీఎం అమిత్ చౌదరి చెంపపై కొట్టాడు. ఆయన ముగ్గురు వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించాడు.
కాగా, పోలింగ్ బూత్ వద్ద పోలీసులు, ఇతర వ్యక్తులు వెంటనే జోక్యం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనాను దూరంగా లాక్కెళ్లారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పార్టీ సస్పెండ్ చేసింది. మరోవైపు పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల అధికారిపై మీనా దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
राजस्थान विधानसभा उप चुनाव, देवली उनियारा से निर्दलीय उम्मीदवार नरेश मीणा ने SDM को थप्पड़ मारा। pic.twitter.com/0sDhZxwnaJ
— News Times Today (@News_TimesToday) November 13, 2024
देवली उनियारा की समस्त जनता और मेरे युवा साथियों से अपील! pic.twitter.com/teGGh5Ul49
— Naresh Meena (@NareshMeena__) November 13, 2024