న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ప్రశంసలు గుప్పించారు. ఆయన స్వచ్ఛమైన హృదయం కలిగిన రాజకీయ నాయకుడని కితాబు ఇచ్చారు. దేశంలో అలాంటి నాయకుడు ఉండటం మన అదృష్టమని అన్నారు. (Sanjay Raut on Rahul Gandhi) అమెరికా టూర్ సందర్భంగా సిక్కు అల్లర్ల గురించి ఒక సిక్కు విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్ ఒక పొరపాటు’ అని ఒప్పుకున్నారు. అప్పుడు పార్టీలో తాను లేనప్పటికీ గతంలో కాంగ్రెస్ పరంగా జరిగిన కొన్ని తప్పులకు తాను సంతోషంగా బాధ్యత వహిస్తానని అన్నారు.
కాగా, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ దీనిని ప్రస్తావించారు. సిక్కు అల్లర్లపై సమాధానం ఇచ్చిన రాహుల్ గాంధీని ఆయన ప్రశంసించారు. ‘రాహుల్ గాంధీ స్వచ్ఛమైన హృదయం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన తన తప్పును అంగీకరించడం మనం చూశాం. మన దేశంలో అలాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం. రాజకీయాల్లో తప్పును అంగీకరించడం చాలా పెద్ద విషయం. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా తప్పును అంగీకరించడం నేర్చుకోవాలి. రాహుల్ గాంధీ మాదిరిగా ముందుకు సాగాలి’ అని అన్నారు.
VIDEO | Here’s what Shiv Sena (UBT) leader Sanjay Raut (@rautsanjay61) said on Congress MP Rahul Gandhi’s ‘Operation Bluestar was a mistake’ remark:
“Rahul Gandhi is a politician with a clean heart. We have seen that he accepts his mistake. We are fortunate that such a leader is… pic.twitter.com/H16XFyyCM2
— Press Trust of India (@PTI_News) May 5, 2025