ఎన్నికల గుర్తు పార్టీ ఆస్తి కాదు
రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను తమ ఆస్తిగా భావించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. పార్టీ పనితీరు నాసిరకంగా తయారైతే గుర్తును కోల్పోవాల్సి రావచ్చని నొక్కిచెప్పింది.
- ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, నవంబర్ 18: రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను తమ ఆస్తిగా భావించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. పార్టీ పనితీరు నాసిరకంగా తయారైతే గుర్తును కోల్పోవాల్సి రావచ్చని నొక్కిచెప్పింది. సమతాపార్టీ తమకు చెందిన కాగడా గుర్తును శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగడా గుర్తు తమదని, దాని మీద ఎన్నోసార్లు పోటీ చేశామని సమతాపార్టీ తన పిటిషన్లో తెలిపింది. ఏకసభ్య ధర్మాసనం ఈ కేటాయింపును సమర్థించగా.. దానిని సవాల్ చేస్తూ సమతాపార్టీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై శనివారం చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పార్టీ పనితీరు తీసికట్టుగా తయారైతే గుర్తును వాడుకొనే హక్కు పోతుందని 1968 ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

