ముంబై: ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. (Stone Pelting) ఈ సంఘటనలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇరానీ గ్యాంగ్ సభ్యులు చైన్ స్నాచింగ్‌లతో సహా పలు నేరాలకు పాల్పడుతున్నారు. ముంబైలోని అంధేరీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం క్రిమినల్ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు బుధవారం రాత్రి అంబివ్లీ ప్రాంతానికి వెళ్లింది.
కాగా, ఈ సందర్భంగా ఇరానీ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ముంబై పోలీస్ అధికారి గాయపడ్డారు. అయితే రాళ్లదాడికి పాల్పడిన వారిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మనోవైపు ఈ రాళ్ల దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.