అమృత్సర్: పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఇంటి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు దిగింది. రాష్ట్రంలో కరెంటు కొరతను నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అమరీందర్ నివాసం వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. అయితే, ఆప్ కార్యకర్తల సంఖ్య అంతకంతకే పెరిగిపోతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతున్నదని భావించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జి చేశారు. వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.
#WATCH | Police use water cannons to disperse Aam Aadmi Party workers who are protesting near Punjab CM Amarinder Singh's 'Siswan Farm House', in view of power crisis in the State. pic.twitter.com/RreKmirjzr
— ANI (@ANI) July 3, 2021